గుండెపోటుతో ఈఈ మృతి
ఆదిలాబాద్ (పట్టణం): గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రపంచ బ్యాంకు కార్యాలయ ఈఈగా పనిచేస్తున్న కిషన్‌రావు (56) శుక్రవారం ఆదిలాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన ఆయన ఏడాదిగా ఆదిలాబాద్‌లో పనిచేస్తున్నారు. ఆర్‌డబ్య్లూఎన్ అధికారులు, వివిధ శాఖలు అధికారులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు.