గుజరాత్ సీఎంగా రూపానీ ఎన్నిక
– ఈ నెల 7న ప్రమాణం
అహ్మదాబాద్,ఆగస్టు 5(జనంసాక్షి):గుజరాత్ నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ యన 7వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రూపానీ పేరును ఖరారు బిజెపి అధిష్ఠానం ఖరారు చేసింది. యువతకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆనందీబెన్ పటేల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 వయసును దాటుతున్న వేళ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ నాయకులు సమాలోచనలు జరిపారు. అనంతరం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీని, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పాటిల్ పేరును ఖరారు చేశారు. వీరు ఆగష్టు 7 న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. విజయ్ రుపానీ… ఆనందీబెన్ కేబినెట్‌లో కార్మిక, ఉపాధి కల్పన శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో అమిత్ షా తదుపరి ముఖ్యమంత్రి అవుతారని వచ్చిన ఊహగానాలకు తెరపడింది.