గురజాడను ప్రభుత్వం అవమానించింది: లోక్‌సత్తా
విజయ నగరం: అధునిక తెలుగు భాషా సాహిత్యాన్ని ఒంటి చేత్తో అధునీకరించిన మహాకవి గురజాడను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని లోక్‌సత్తాపార్టీ విజయనగరం జిల్లా నేతలు విమర్శించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన గురజాడ 150వ జయంతి ముగింపు ఉత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని వారు పేర్కొన్నారు. గురజాడ కుటుంబాన్ని అదుకుంటామని, హైదరాబాద్, విజయ నగరంలో ఆయన స్మారక కళమందిరాల నిర్మాణం చేపడతామని, ఆయన నివసించిన ఇంటిని ఆధునీకరించి పర్యాటక ప్రదేశంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. అవేవీ చేయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా లోక్‌సత్తా ఆధ్వర్యంలో సాహితీ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల నేతలు , తదితరులు పాల్గొన్నారు.