గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనం
యాచారం: నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న రెండు మృతదేహాలను దుండగులు అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగుల పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.