గుర్తు తెలియని వ్యక్తి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ :స్థానిక రైల్వే గేటు వద్ద డౌన్‌లైన్‌లో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియలేదని జనగాం జీఅర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లయ్య తెలిపారు. మృతదేహన్ని జనగాం ఏరియా అస్పత్రికి తరలించి 2 రోజుల పాటు భద్రపరుస్తామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.