గొర్కంటి మల్లేష్ అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలి
ఎంపీఓ తిరుపతికి వినతి
శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి :
మండల పరిధిలోని గోమారం గ్రామంలో సర్వే నెంబర్ 589 లో మాకు వ్యవసాయ భూములన్నాయి. ఇందులో కొంత భూమిని ఇతరులకు విక్రయించమని ఇదే భూమి లో గోమారం గ్రామానికీ చెందిన గొర్కంటి మల్లేష్ భార్య గొర్కంటి రేణుక పేరున అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నందనం శ్రీనివాస్ బుధవారం మండల పంచాయతీ అధికారి తిరుపతి రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు నందనం శ్రీనివాస్, సరస్వతి విలేఖరులతో మాట్లాడుతూ ఎక్కడో ఉన్న సర్వే నెంబర్ 585 లో గొర్కంటి రేణుక పేరున ఇంటి నిర్మాణ అనుమతులు పొంది, మా స్వంత వ్యవసాయ భూములు సర్వే నెంబర్ 589 లో గొర్కంటి రేణుక భర్త మల్లేష్ అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. తన భూమిని అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గొర్కంటి మల్లేష్ తమ భూములు కబ్జా చేసిన విషయం గోమారం గ్రామ పంచాయతీలో కూడా పిర్యాదు చేశామని,ఇదే విషయం గురించి సర్పంచ్ లావణ్య మాధవ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అక్రమ ఇంటి నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని కోరిన సర్పంచ్ లావణ్య భర్త పెద్దపట్లోరీ మాధవరెడ్డిపై గొర్కంటి మల్లేష్, శాదుల్లా లతో పాటుగా కొంత మంది దాడి చేశారని ఆరోపించారు. తన భూమిని కబ్జా చేసి అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులు నిలుపుదల చేయించి మల్లేష్, రేణుకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందనం శ్రీనివాస్, సరస్వతి, వేణుగోపాల్, రవీందర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.