గోడ కూలి ఇద్దరికి గాయాలు
సిరిసిల్ల జూన్ 16 (జనంసాక్షి) పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఓ పాత ఇంటిని కూలకొట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మండ లంలోని రామచంద్రాపూర్‌కు చెందిన రొడ్డ లక్ష్మీరాజం, ఇల్ల ంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌కు చెందిన కొరు మల్ల రాజయ్యలు రోజులాగే కూలిపనికి వెళ్లారు. గణేష్‌నగర్‌లోని ఇంటిగోడను సుత్తేలతో కూలకొడుతుండగా ప్రమాదవశాత్తు గోడకూలి లక్ష్మిరాజం కాలుకు తీవ్రగాయంకాగా, రాజయ్యకు తలకు దెబ్బతలగడంతో వీరిని చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.