గోదావరి నది మధ్యలో చిక్కుకు 9 మంది వ్యవసాయ కూలీలు

స‌హ‌య‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన రిక్యుటీం

నియోజకవర్గం బోర్న పల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోగా ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పర్యవేక్షిస్తున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని NDRF బృందాలు వస్తున్నాయి అని గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు,ప్రజా ప్రతినిదులు వర్షాల నేపథ్యంలో ప్రజలను హెచ్చరిస్తున్నారని, సూచనలు చేస్తున్నారని, అయినా రోజువారి వ్యవసాయ పనిలో భాగంగా బోర్నపల్లి కి చెందిన కూలీలు యధావిధిగా పనులకు ఉపక్రమించడంతో గత రెండు మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారి వరద ఉధృతి పెరగడం వల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి NDRF బృందాలను పంపించడం జరిగిందని సహయక చర్యలు ప్రారంభమవుతున్నాయని, మహారాష్ట్రలో సైతం అత్యధిక వర్షాలు కురవడం ఏస్సారెస్పీ ప్రాజెక్టు త్వరగా నిండడం గేట్లు ఎత్తి వేయడం ద్వారా రానున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి ఈరోజు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని,ముఖ్యమంత్రి కేసిఆర్ గారు,
మంత్రి వర్యులు కేటీఆర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు,జిల్లా కలెక్టర్,ఎస్పీ గారు సైతం సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని,
వారు క్షేమంగానే ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా గత కొన్ని రోజుల నుండి హెచ్చరిస్తూ ఉందని 9మందిని రక్షిస్తామని అన్నారు.