గోపాల్ పేట ఏదుల రోడ్డును త్వరగా పూర్తి చేయాలి

జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకుల డిమాండ్
గోపాల్ పేట్ జనం సాక్షి జూలై(29) గోపాల్ పేట్ నుండి ఏదుల వరకు ఏర్పాటు చేయబోయే ఆర్ అండ్ బి రోడ్డును శుక్రవారం నాడు వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు అనంతరం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కో కన్వీనర్ చిరంజీవి, ఉపాధ్యక్షుడు వెంకటేష్,రమేష్,మాట్లాడుతూ మూడేళ్లు క్రితం గోపాల్ పేట్ నుండి ఏదుల రోడ్డు శాంక్షన్, అయ్యి టెండర్ పూర్తయిన రోడ్డు నిర్మాణ పనులు నత్త నడక న సాగుతున్నాయన్నారు, ఈ రోడ్డు పనులు సకాలంలో పూర్తికావకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గోపాల్ పేట్ నుండి ఏదులరోడ్డును త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చర్యలు తీసుకొని త్వరగా పూర్తి చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.
*గోపాల్ పేట్ బిసి వసతి గృహం పనులు ను ప్రారంభించాలి*
గోపాల్ పేట్ మండల కేంద్రంలో నూతన బీసీ వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ నూతన బీసీ గృహం నిర్మాణం కేవలం శిలాఫలకానికి మాత్రమే పరిమితమైందన్నారు దీని ద్వారా విద్యార్థుల కు నూతన వసతి గృహం లో చదువుకోవాలనే కోరిక అందని ద్రాక్ష గానే మిగిలిందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి నూతన బి సి వసతి గృహం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్,కోకన్వీనర్ చిరంజీవి,ఉపాధ్యక్షులు వెంకటేష్,రమేష్,ఆంజనేయులు తో పాటు గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సుధాకర్ రావు,విష్ణు,జనార్ధన్,శ్రీనివాసులు, రాములు తదితరులు పాల్గొన్నారు
 
Attachments area