గోసంరక్షకులు ముసుగుదొంగలు

4

వాళ్లంతా అసాంఘీక శక్తులు

పగలు అక్రమార్కులు..రాత్రి సంరక్షణ వేషం

చేతనైతే ఆవుల్ని పాలిథిన్‌ తినకుండా కాపాడండి

ప్రధాని నరేంద్ర మోదీ ఘూటైన వ్యాఖ్యలు

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి):గోసంరక్షకుల పేరుతో చాలామంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్ర హం వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో 80 శాతం మంది తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు పని చేస్తున్నారని మండిపడ్డారు. గో సంరక్షణ పేరుతో కొం దరు దుకాణం తెరుచుకొని కూర్చున్నారని, అటువంటి వారిపై తనకు చాలా కోపం వస్తోందన్నారు. రాత్రంతా అక్రమాలు చేసి పగలు గో రక్షకుల ముసుగులు ధరించి తిరుగుతుంటారని విరుచుకుపడ్డారు. ప్రజలు నిర్లక్ష్యంగా రోడ్లపై పడేసే ప్లాస్టిక్‌ బ్యాగులను తినడం వల్లనే ఎక్కువ గోవులు చనిపోతున్నాయని మోడీ చెప్పా రు. ప్లాస్టిక్‌ బ్యాగులు రోడ్లపై పడేయకుంటే గోవులకు అదే పెద్ద సేవ అన్నారు. గో సంరక్షకులు ఈ విషయం లో ప్రజలను చైతన్యపరచాలని కోరారు.గుజరాత్‌ లోని ఉనా సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడి తొలిసారి స్పందించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన టౌన్‌ హాల్‌ విూటింగ్‌ లో ఈ విషయం ప్రస్తావించారు. గుజరాత్‌ లోని ఉనాలో గోమాంసం, చర్మాలు తరలిస్తున్నారని కొందరు యువకులను ఇటీ వల నడిరోడ్డుపై బట్టలిప్పి తీవ్రంగా కొట్టారు. గో సంర క్షణ బృందం చేసిన ఈ దాష్టీకం వెలుగులోకి రావడం తో గుజరాత్‌ భగ్గుమంది. ప్రతిపక్షాలు, దళిత సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రమంతా ఆందోళనలు చేశా యి. పార్లమెంటుని కూడా ఈ అంశం కుదిపేసింది. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేప థ్యంలో ఈ ఘటన బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఇప్పటికే పటీదార్ల రిజర్వేషన్ల ఆందోళనలతో తల బొప్పి కట్టిన సర్కారు ప్రతిష్టను ఉనా ఉన్మాదం మరిం త మసకబార్చింది. దీంతో, బీజేపీ నష్టనివారణ చర్య లను ప్రారంభించింది. అన్నిటికీ ప్రధానినే బాధ్యత చే స్తే పాలన ఎలా అవుతుందిప్రజాస్వామ్యంలో ఐదేళ్లపా టు నిష్కియ్రగా ఉండి నచ్చకపోతే మరొకరికి ఓటువే యడం మంచి పరిణామం కాదని ప్రధాని నరేంద్ర మో దీ అన్నారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సం దర్భంగా దిల్లీలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరికొత్త ఒరవడికి తెరతీశారు. విదేశాల్లో ఉన్న టౌన్‌హాల్‌ సాంప్రదాయాన్ని మనదగ్గర ఆచరణలోకి తీసుకువచ్చారు. పౌరులతో ముఖాముఖి జరిపే సమావేశమే ఈ టౌన్‌హాల్‌ కార్యక్రమం. సదస్సుకు హాజరైన వ్యక్తులు, వక్తల మధ్య ప్రశ్న-సమాధానం రూపంలో సమావేశం కొనసాగుతుంది. మైగవ్‌.ఇన్‌ పోర్టల్‌ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టౌన్‌హాల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో టౌన్‌హాల్‌ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మైగవ్‌.ఇన్‌ పోర్టల్‌లో సలహాలు, సూచనలు ఇచ్చిన 2 వేల మంది క్రియాశీల సభ్యులు హాజరయ్యారు. మైగవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి ప్రధాని బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా టౌన్‌హాల్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పీఎంవో యాప్‌ను ఆవిష్కరించారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా ఈ మోబైల్‌ యాప్‌ రూపకల్పన జరిగినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఒకసారి ఓటు వేయండి.. ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వండి అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. ప్రజాస్వామ్యమంటే ప్రజలను భాగస్వాముల్ని చేయడమేనన్నారు. దురదృష్టవశాత్తు ఓటు వేసి ఐదేళ్లు వేచిచూడటమే మనకు అలవాటుగా మారిపోయిందని, ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుందనే అలసత్వం ప్రజల్లో ఏర్పడిందన్నారు. స్వచ్ఛభారత్‌ కోసం దేశంలో వచ్చిన స్పందనే ప్రజల భాగస్వామ్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎంతో ఖర్చు చేసి ఆధునిక సాంకేతిక వసతులతో ఆస్పత్రులు నిర్మించినా.. రోగులకు ఫలితం ఉండటంలేదని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని ఏ చిన్న గ్రామంలో సమస్య వచ్చినా.. పట్టణంలో సమస్య వచ్చినా.. అన్నీ ప్రధానినే అడుగుతారు. రాష్ట్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా.. ప్రధాని వైపే అందరూ చూస్తారు. మరి అన్నింటికీ ప్రధాని బాధ్యత వహిస్తే అది సరైన పరిపాలనా విధానం కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి చోటా బాధ్యతాయుతమైన పరిపాలన సాగినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని మోదీ అన్నారు. ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మారినప్పుడే ప్రజలకు సరైన పాలన అందుతుందన్నారు. సుపరిపాలనలో అధికారిక పక్రియ తక్కువగా ఉండాలి. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే కీలకమని, ప్రజలు సమస్యలతో ముందుకు వచ్చినప్పుడు వాటికి తక్షణమే పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలదన్నారు. కచ్చితమైన కాలావధిలో సమస్యలను సమయ పరిష్కారం బాధ్యతాయుతమైన సమాధానం ప్రజలకు లభించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సుపరిపాలనే సరైన విధానమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ప్రతి అంశంలోనూ సుపరిపాలన తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నట్లు చెప్పారు. భారత్‌ వర్షాధారితం.. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉందని, వరుసగా రెండేళ్లు కరవు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్నారు. వ్యవసాయంలో సంకట పరిస్థితి వస్తే కొనుగోలు శక్తి పడిపోతుందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 7.6శాతం వృద్ధిరేటుతో దేశం ప్రగతిపథాన సాగుతోందన్నారు. ఇంట్లో ఒక వ్యక్తి మాత్రమే సంపాదిస్తే.. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. అదే ఇంట్లో ఇద్దరికి ఉపాధి లభిస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందన్నారు. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుంది.. పరిశ్రమలు వృద్ధి చెందుతాయన్నారు. ఇది ఒక ఉత్తమ ఆర్థిక వలయంగా ఏర్పడి.. దేశ ప్రగతి వేగవంతమవుతుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.