*గౌని ఐలన్న అక్రమ అరెస్టును ఖండించండి., సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు..
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం,)జూన్ 08) జనం సాక్షి. తిరుమలాయపాలెం మండల పరిధిలోని హస్నాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి. అఖిలభారత రైతు కూలి సంఘం ఏ ఐ కె ఎమ్ ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌనీ ఐలన్న ను ఆళ్లపల్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని హస్నాబాద్ గ్రామం లో బుధవారం జరిగిన సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు ఖండించారు. నిత్యం పేద ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం ప్రజలే ప్రాణంగా ఉద్యమమే ఊపిరిగా నిత్యం ప్రజల మధ్యన పోరాడుతున్న నాయకులను తెలంగాణ ప్రభుత్వం నిర్భందించి నెలల కొద్దీ జైల్లో నిర్బంధించి జైల్లో పెట్టినంత మాత్రాన ఉద్యమాలను అరచేతిని అడ్డుపెట్టి విప్లవాన్ని ఆపలేరని కెసిఆర్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి కేసులు గాని ఎన్కౌంటర్లు గాని ఉండవు అని చెప్పిన కేసీఆర్ ఈరోజు పోడు భూముల కోసం డబల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు 3 ఎకరాల తో పాటు పది లక్షలు ఇవ్వాలని. నిరుద్యోగులకి నిరుద్యోగ సమస్యలు తీర్చే ఉద్యోగాలు ఇవ్వాలని. ఆదివాసీ భూములకు పట్టాలివ్వాలని. పోరాడుతున్న విప్లవ పార్టీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ గౌని ఐలన్న అనారోగ్యంతో కాలు నొప్పి తో నడవలేని స్థితిలో ఉన్న పోలీసులు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించ దాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు ఖండించాలని వెంటనే భేషరతుగా విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం సబ్ డివిజన్ కమిటీ కోరింది. ఉద్యమ నాయకులను అరెస్టు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లో లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల నాయకులు కొత్తపల్లి వెంకట్ రెడ్డి , నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ ముదిరెడ్డి వెంకట్ రెడ్డి, బండపల్లి రామాచారి , లింగారెడ్డి ,వీరారెడ్డి , సాయిబాబా, నరసింహారెడ్డి ,లలిత ,సునీత ,లక్ష్మి, ధనమ్మ ,చంద్రకళ , రాంరెడ్డి, లక్ష్మీపార్వతి, మాగి జాలి మామిడాల సురేష్ , పాల్గొన్నారు…