గౌరవ డాక్టరేట్ గ్రహీత సుతారి రాజేందర్కి తెలంగాణ ప్రజా సంఘాలు మరియు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం

మల్లాపూర్ (జనంసాక్షి) ఆఘష్టు:02 మల్లా పూర్ మండలం పాత ధారాజ్ చెందిన పల్లి గ్రామానికి చెందిన సుతారి రాజేందర్ చెన్నైలోని హెూసూర్ క్లరిస్టా హెూటల్లో శనివారం నిర్వహించిన కార్య క్రమంలో ఆసియా వేదిక కల్చర్ రీసెర్చ్ యూనివర్స్ నుండి సామాజిక సేవలో భాగంగా గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది . ఈ సందర్భంగా ఈ రోజు మల్లాపూర్ మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ మరియు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. స్వయంకృషితో పట్టుదలతో అంచలంచలుగా ఎదుగుతూ సమాజంలో కష్టాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మరియు కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ అవార్డు అందుకున్నటువంటి సుతారి రాజేందర్ గారికి రావడంతో సంతోషకరం, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రజాసంఘాల మండల అధ్యక్షుడు ముద్దం చంద్రప్రకాష్ గారు మాట్లాడడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, ప్రజా సంఘాల నియోజకవర్గ ఉపాధ్యక్షులు మండస్వామి, ప్రజా సంఘాల మండల ఉపాధ్యక్షులు సిద్ధ బాలరాజ్, నాయకులు రుద్ర రాంప్రసాద్, నూతిపెల్లి రాజం ,ఉయ్యాల లక్ష్మణ్, అరిగడ్డి సురేష్, మోర్తాటి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.