గ్యాస్‌ ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌,జూలై8( జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఉద్యమిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. పెంచిన వంట గ్యాస్‌ ధర తగ్గించాలనే డిమాండ్‌ తో రోండోరోజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఆందోళనలు చేట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించకుంటే బీజేపీకి బుద్ధి చెబుతామన్నారు. ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తాని నినదించారు.