‘గ్యాస్‌’ పై న్యాయం చేస్తామన్నారు : సీఎం

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) : రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపులపై ప్రధాని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్యాస్‌ కేటాయింపులపై రాష్ట్రం వినతిని ప్రధాని మంగళవారం పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని సీఎం వివరించారు. రాష్ట్రానికి తీసేసిన 2 ఎంఎంఎన్‌ సీఎండీ గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించాలని ప్రధానికి వివరించామన్నారు. గడిచిని 20 ఏళ్లలో ఇంతటి విద్యుత్‌ కొరత ఎన్నడూ లేదని సీఎం తెలిపారు. గ్యాస్‌ కేటాయింపులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి 2008లో తీసుకున్న పునర్‌ పరిశీలించాలని, రిలయన్స్‌ గ్యాస్‌ ఎక్కువగా కేటాయించాలని, రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టులను తగ్గించొద్దని ప్రధానిని కోరినట్లు సీఎం వెల్లడించారు. 2009లో కేటాయిస్తామన్న 75 శాతం గ్యాస్‌ను రాష్ట్రానికి అందివ్వాలని అభ్యర్థించినట్లు తెలిపారు. కేంద్రం ఒత్తిడి పెంచి రాష్ట్రంలో విద్యుత్‌ కొరత నివారించేందుకు కృషి చేస్తామని సీఎం వివరించారు.