గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరగకుండా అవగాహన!

లింగంపేట్ 22 క్టోబర్ (జనంసాక్షి)
గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరగకుండా భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో శనివారం లింగంపల్లి కుర్దు గ్రామంలో గ్రామ ప్రజలకు గ్యాస వాడకం పై అవగాహణ కల్పించారని గ్రామ సర్పంచ్ బండి రాజయ్య తెలిపారు.గ్యాస్ సిలిండర్,స్టవ్ ఎలా ఉపయోగించాలి అనే దాని పై ఇంటింటికి తిరిగి పలు సూచనలు జాగ్రత్తలు తెలిపారు.గ్రామంలోని కూడలి వద్ద ప్రజలందరికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ ఇన్స్పెక్షన్ ఎగ్జిక్యూటివ్ దేవరాజ్,లింగంపేట్ ఎస్ఎంపి భారత్ గ్యాస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.