గ్రంథాలయం జులై మాసం ఉత్తమ పాఠకులకు బహుమతులు ప్రధానం
మోత్కూరు ఆగస్టు 17 జనంసాక్షి : మోత్కూర్ శాఖా గ్రంథాలయం సేకరించిన పది వేల పైచిలుకు పుస్తకాలను పాఠకులకు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల 5 మంది ఉత్తమ పాఠకులను ఎంపిక చేసే క్రమంలో జులై మాసం ఉత్తమ పాఠకులను బుధవారం గ్రంథాలయ ఛైర్మన్ కోమటి మత్స్యగిరి అధ్యక్షతన ఉత్తమ పాఠకులకు శాఖ గ్రంథాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎం.డి అబ్దుల్ నబీ సౌజన్యం తో టిఫిన్ క్యారేజ్ బాక్స్ లను విశ్రాంత ఉపాధ్యాయులు చేపూరి బిక్షం,ఎం.డి ఫక్రుద్దీన్,ప్రయివేట్ స్కూల్ ఉపాధ్యాయులు నిలిగొండ సైదులు, టి.ఎస్.ఎల్ పి డి సి.ఎల్ ఉద్యోగి చోల్లేటి సోమేశ్వర్, టిఆర్టీ అభ్యర్థిని దోర్నాల భారతి కి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, గ్రంథాలయం వైస్ చైర్మన్ పొలినేని స్వామి రాయుడు, గ్రంథాలయం అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కప్పె యాకేశ్,గ్రంథాలయం ఇంచార్జ్ చిలకమర్రి బాబు చారి,ఓయూ జేఏసీ నాయకులు మర్రి అనిల్ కుమార్, పాఠకులు బయ్యని రాజు,తీపిరెడ్డి సోమిరెడ్డి,మర్రి ఆనందం, కూరేళ్ల పరమేష్,జంగ నాగరాజు,ప్రవీణ్,రాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోత్కూర్ గ్రంథాలయ అభివృద్ధి కి తన వంతు గా రూ.3000/- సహాయం అందజేసినందకు కో ఆప్షన్ సభ్యులు ఎం.డి అబ్దుల్ నబీ కి శాఖా గ్రంథాలయం పక్షాన ఛైర్మన్ కోమటి మత్స్యగిరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.