గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

సిఐటియు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు
జనం సాక్షి,వంగూర్:
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్  వేతనాలను చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని ఉల్పర  గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని ఆయన  విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న  ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర ఉద్యోగస్తులకు పి ఆర్సి ఇస్తున్నట్లుగా గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపచేయాలని అన్నారు. ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంకల్పించాలని సంవత్సరానికి రెండు జతల బట్టలు, బూట్లు, మాస్కులు, సబ్బులు ఇవ్వాలని ప్రమాద  భీమ వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలు అకౌంట్లో వెయ్యాలని అన్నారు. నవంబర్ 19,20 తేదీలలో నాగర్ కర్నూల్ పట్టణంలో జరుగు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు అజీమ్, రామస్వామి, నిరంజన్, చంద్రయ్య, కాంతమ్మ ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area