గ్రామానికి చెందిన స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోమని కుల సంఘాల వెల్లడి

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి);
రుద్రంగి బస్టాండ్ ప్రాంతంలోని స్థల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది గత 6 నెలల క్రితం గ్రామనికి సంబంధించిన స్థలాన్ని  కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని చూడడంతో గ్రామ ప్రజలతో పాటు కుల సంఘాలు ఏకమై ధర్నా నిర్వహించి అట్టి స్థలంలో కూరగాయల మార్కెట్ కోసం గోడ నిర్మించారు.ఆ సమయంలో ధర్నాలో పాల్గొన్న 12 మంది పై కేసు నమోదు అయినట్టు పోలీసులు ఆరునెలల తర్వాత చెప్పడంతో గోడ వివాదం మళ్ళీ మొదలయింది.శనివారం 36 కుల సంఘాల పెద్దమనుషుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ… కొందరు ప్రజాప్రతినిధులు మరియు కొందరు పత్రిక రిపోర్టర్లు కలిసి గ్రామానికి చెందిన స్థలాన్ని కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేయడం సరికాదని భూమి కబ్జా చేస్తున్న వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కుల సంఘాల ముందు ప్రజల ముందుకు తీసుక రావాలని కోరారు.అక్రమంగా కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని బస్టాండ్ ప్రాంతంలోని స్థలాన్ని అధికారులు న్యాయంగా సర్వే చేసి గ్రామనికి సంబంధించిన స్థలాన్ని రక్షించాలని కోరారు.
Attachments area