… గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు ధర్నా

జనం సాక్షి ఆగస్టు 2 రాయికల్ మండల్…. అల్లిపూర్ … గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆ ధర్నా కార్యక్రమానికి పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి గారు వారికి తన సంఘీభావం ప్రకటించారు. మున్ముందు మండల కేంద్రం ఏర్పాటు చేయడానికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇస్తూ…అల్లిపుర్ నుండి రాయికల్ వరకు, సామాన్య ప్రజలు ఆటోలలో ఎలా ప్రయాణిస్తున్నరో చూద్దామని ఒక రాజకీయ నాయకుడిగా కాక ఒక సామాన్య వ్యక్తిగా ప్రయాణికులతో ప్రయాణించడం జరిగింది. ప్రజల మనిషిగా ఇలా ఆటోలో వెళ్లడం అతి కొద్దీ నిమిషాల లోపే తెలంగాణ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది…ప్రజల మనిషిగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి గారు అల్లిపూర్ నుండి ఆటోలో ప్రయాణించడం మరొక్కసారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.