గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు

జగిత్యాల,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): గ్రామాల్లో ఏర్పాటు చేసిన మక్క విక్రయ కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని మెట్‌పల్లి విశాల సహకార సంఘం అధ్యక్షుడు మారు మురళీధర్‌రెడ్డి సూచించారు. పంట విక్రయాల్లో రైతుల ఇక్కట్లను తొలగించేందుకే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు
తెలిపారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు మక్కలను కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. క్వింటాలు మక్కలకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర
రూ. 1700 చెల్లించనున్నట్లు చెప్పారు. దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.