గ్రామాల అభివృద్దే సిఎం కెసిఆర్ లక్ష్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 08 జనంసాక్షి : గ్రామాల అభివృద్దే సిఎం కెసిఆర్ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని గొట్టి ముక్కల గ్రామంలో గ్రామ సర్పంచ్ పట్లే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదేశించిన రోజువారీ కార్యక్రమాలను తప్పనిసరిగా చేయాలన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక అయిన పాఠశాలలో చేపట్టవలసిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులకు ఇబ్బంది కలగకుండా తొందరగా వడ్లు కొనుగోలు పేర్కొన్నారు. వడ్లు నింపడానికి సరఫరా చేసిన సంచులు రంధ్రాలు లేకుండా మంచివి సరఫరా చేయాలని జిల్లా సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.