గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పిటిసి
ఏర్గట్ల జూన్ 2 ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్,బట్టా పూర్ గ్రామాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామీణ క్రీడా ప్రాంగాణాన్ని జడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ యొక్క ప్రాంగణాలలో కబడ్డీ, కోకో, వాలీబాల్, లాంగ్ జంప్ ల కోర్టులు ఏర్పాటు చేశామని ఆయా గ్రామాల్లోని యువకులు ఈ యొక్క క్రీడా స్థలాలను వినియోగించుకొని దేహ దారుఢ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పత్తి రెడ్డి ప్రకాష్ రెడ్డి , కటకం పద్మ సాగర్, తెరాస మండలాధ్యక్షులు రాజ పూర్ణానందం, కో ఆప్షన్ సభ్యులు ఆశ్రఫ్, తాసిల్దార్ సురేష్, ఎంపీడీవో కర్నే రాజేశం, వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్, ఎంపిఓ శివ చరణ్, ఏపీవో వెంకటేష్, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, కార్యదర్శులు రవి, శ్రీకాంత్, తదితరులు