గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 18(జనంసాక్షి) అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో అమిరిశెట్టి లింగమ్మ(82)అనారోగ్యంతో మరణించగా,గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సర్పంచ్ గద్దల రమేష్ చేతుల మీదుగా రూ.5 వేలను కుటుంబ సభ్యులకు అందజేసి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వెంట వార్డు సభ్యులు ఇల్లందుల లావణ్య రమేష్,కోఆప్షన్ సభ్యులు ఆవుల చిన్న వెంకటయ్య,పులికాశి రమేష్ ,సభ్యులు ఇల్లందుల జంపయ్య,పొడుపాటి లింగయ్య,శేఖరయ్య,అమిరిశెట్టి శ్రీనివాస్,చుంచు వెంకటయ్య(డ్రైవర్),చల్లగొండ చిన్న స్వామి రావు,గడ్డమీది తిరుపతి,పొడుపాటి రాజేందర్,మంద రఘు,ఇటుకల అనిల్,గద్దల ప్రవీణ్,గాదార్ల ఎల్లయ్య,చుంచు పరశురాం,గౌరవేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.