*గ్రామ అభివృద్ధే లక్ష్యం- సర్పంచ్ బుచ్చమ్మ*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని పిల్లోనిగుడ సర్పంచ్ బుచ్చమ్మ అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోగుడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన అచ్చంపేటలో బుధవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ బుచ్చమ్మ.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు అవసరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అంచలంచలుగా పూర్తి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామంలో మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు సిద్దులు, జ్యోతి, సుధాకర్, అనసూయ, పంచాయతి కార్యదర్శి భాస్కర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు జుర్కి రమేష్ పటేల్,రవీందర్, నరసింహ, మహేష్, గౌరీ శంకర్, వెంకటేష్, దశరథ్,మహేందర్, రాజు,కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : అచ్చంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేస్తున్న సర్పంచ్ బుచ్చమ్మ.
Attachments area