గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):తమ గ్రామంల కోతుల బెడద తీవ్రంగా ఉందని కోతుల బారి నుండి తమను రక్షించాలని గ్రామ కార్యదర్శికి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాచారం గ్రామంలో గత 3 సంవత్సరాల నుండి నుండి కోతులు తిరుగుతున్నాయి. గతంలో తక్కువ సంఖ్యలో ఉన్న కోతులు ప్రస్తుతం సుమారు 200వరకు వాటి సంఖ్య పెరగండంతో ప్రమాదస్థాయి ఉంది. పిల్లలపై, పెద్దలపై మహిళలపై దాడులు చేసి గాయపరిచి ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. అంతేకాకుండా కోతులు రాత్రివేలలో ఇండ్లపైకి ఎక్కి మమ్ముల్ని నిద్రించకుండా చేయడమే కాకుండా ఇంటి పై కప్పు రేకులను పగులగొడుతున్నాయి. ఇంటి ముందున్న చెట్లను నాశనం చేస్తున్నాయి. విటివల్ల పిల్లలు, పెద్దలు, మహిళలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇంటి తలుపులు తీసి ఉంటే ఇంట్లో మహిళలు ఉన్న వంట సరుకులను. ఎత్తుకెల్తున్నాయి. వీటి వల్ల కుటుబాలకు కుటుంబాలే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిరణా షాపుల పై దాడి చేయడంతో పాటు, కిరణా వస్తువులను తీసుకేళ్తున్న వారి చేతిలో ఉన్న సరుకులను గుంజుకొని పోతున్నాయి. ఇలా చెప్పు కుంటూపోతే యాచారం గ్రామంలో కోతుల వల్ల ప్రజలు ప్రాణాలను అరచేతి లో పెట్టుకొని బ్రతకాల్సివస్తుంది. ఇప్పటికైనా అధికారులు కల్పించుకొని కోతుల బారి నుంచి గ్రామస్తులను రక్షించాలని అన్నారు  ఈ కార్యక్రమం లో  కేశమోని దశరథ గౌడ్ మాజి ఎంపీటీసీ. మస్కు వెంకటయ్య మాజి సర్పంచ్
రెడ్డి వెంకటరెడ్డి, కేశమోని బుచ్చయ్య గౌడ్, భూతరాజు యాదయ్య, జోగు అంజయ్య, మస్కు ప్రతాప్, మస్కు యాదగిరి, అనిల్, గొల్లపల్లి జంగయ్య గౌడ్,  మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు