గ్రామ గ్రామాన అమరవీరుల వర్ధంతి సభలు జరుపుకుందాం * సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపు

టేకులపల్లి, అక్టోబర్ 28( జనం సాక్షి ): భూమికోసం భుక్తి కోసం భారత దేశ ప్రజల విముక్తి కోసం విప్లవోద్యమంలో మృతి చెందిన అమరవీరులను వారి త్యాగాలను స్మరించుకుంటూ నవంబర్ 1 నుండి 9 వరకు గ్రామ గ్రామాన అమరవీరుల వర్ధంతి సభలు జరుపుకుందామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల వరకు ఎందరో అమరులు తమ రక్తంతో జెండాను ఎరుపు ఎక్కించారని, సిపిఐ( ఎంఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు దూబాకుల ప్రసాద్ అన్నారు. శనివారం బోడులో జరిగిన ముఖ్యల సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక త్యాగాలతో నిర్మించిన విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేక్రమంలో బిక్కుమియా,తుమ్మలపల్లి హనుమంతరావు,గుగ్గిళ్ళ వెంకటేశ్వర్లు,ఈసం పాపన్న, బొర్ర వీరస్వామి, బొర్రా ముత్తన్న, ఎల్లన్న, కాంపాటి చంద్రం, పులుసు వెంకన్న, ఎస్కే జలీల్ పాషా,దొరన్న,బాటన్న, పగడాల వెంకన్న, నంబూరి సీతారామారావు, నోముల పరశురాములు, సుసేన, చింతా లక్ష్మి, కోటన్న, ముశ్మి, వెంకన్న, సుజాత, కుమార్ అమరవీరులు ఇంకా ఎంతోమంది అమరత్వం చెందారని అన్నారు. భూమి, బుక్తి, విముక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం సర్వస్వం తమ జీవితాన్ని ధారపోసిన అమరవీరులను స్మరిస్తూ గ్రామ గ్రామాన సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు మండల అధ్యక్ష,కార్యదర్శులు గుగులోతు రామచందర్,ఎట్టి నరసింహారావు,ఐఎఫ్టియు నాయకులు ఆర్ కోటిలింగం,సిరికొండ నాగేశ్వరరావు వెంకటమ్మ,వినోదు, సమ్మయ్య,పొట్టయ్య, వెంకట రామ్, రవి తదితరులు పాల్గొన్నారు.