గ్రామ గ్రామాన 75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు

తరిగొప్పుల (జనం సాక్షి) ఆగస్టు10;     75 వ స్వతంత్ర వజ్రోత్సవం సందర్భంగా తరిగొప్పుల మండలం  అబ్దుల్ నాగారం గ్రామంలో గౌరవ సర్పంచ్ శ్రీమతి శ్రీ అర్జుల రమ -సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణం సమీపంలో సుమారు 1000 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి ప్రదాత  అర్జుల సంపత్ రెడ్డి గారు,  గ్రామ ఉపసర్పంచ్   భాషబోయిన  రాజు, కార్యదర్శి లింగం. గ్రామ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.