గ్రామ పంచాయతీల వారిగా పత్తి విత్తనాల కేటాయింపు
నర్సంపేట, జూన్ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం చినట్టు మండల వ్యవసాయ శాఖాధికారి దం డు ఉపేందర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచన ల మేరకు గ్రామ ప్రత్యేక అధికారి వీఆర్వో, పంచాయతీ సెక్రటరి, ముగ్గురు ఆదర్శరైతులను ఎన్నుకోని పత్తి విత్తనాలను ఆ గ్రామ రైతులంద రికి అందేవిధంగా కమిటీలను ఏర్పాటు చేశా రు. ఈ విధంగా ఎన్నుకున్న రైతులపేర్లను సం బంధిత పంచాయతీ కార్యాలయాలకు పంపించి నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని మహిళ రైతులు , రైతులు సద్వినియోగపరుచుకోవాలని వారం రోజుల్లో పత్తి విత్తనాలు తీసుకోవాలని కోరారు.
డ్రా పద్ధతిని ఎత్తివేయాలి తొర్రూరు:
పత్తి విత్తనాల డ్రా పద్దతిని ఎత్తివేయాలని సీపీి ఎం మండల కార్యదర్శి మేకల కుమార్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీప్‌లో రైతులు పత్తి విత్తనాలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ఈవిధంగా డ్రా పద్దతిని పెట్టడం అమానుషం అని ఆయన అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు తక్కువగా మంజూరీ కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈవిధానాన్ని ఎత్తివేసి పత్తి గింజలను గ్రామాల వారిగా వ్యవసాయ అధికారులతో పంపిణీ చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమములో సీపీఎం పట్టణ కార్యదర్శి బొల్లం అశోక్, వెంకటరెడ్డి, ఎండి యాకూబ్, వెంకటేశ్వర్లు, స్వామి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.