గ్రామ పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

గ్రామాల పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం లోని కోటిపల్లి మండలంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా కోట్ పల్లి* మండల పరిధిలోని ఎన్కెపల్లిగ్రామంలో  పర్యటించారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు.ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కార్మికులకు డబ్బులు చెల్లించ లేనటువంటి వారికి వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు, గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, ప్రజలకు విద్యుత్ అధికారులు అందుబాటులోఉండాలన్నారు. గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1, 11, 21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
 గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు మరియు పిచ్చిమొక్కలు తొలగించాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు, ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగాఉంచుకోవాలన్నారు.గ్రామంలో 1 మరియు 7వ వార్డులలో నీటి కొరతను అధిగమించాలని, లీకేజీ సమస్య లేకుండా చూడాలని, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలని, ప్రజలు చెర్రల తీయరాదని, ట్యాప్ లు వాడాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
 పల్లె ప్రగతి సక్రమంగా నిర్వహించలేదని, గ్రామ పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లె ప్రగతిలో పూర్తి కానటువంటి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
 గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచాలన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
 నూతనంగా నిర్మించబోయే సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
 గ్రామ సర్పంచ్ భారతమ్మ ప్రభాకర్ రెడ్డి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రైతుబంధు అధ్యక్షులు సత్యం మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్ మండల్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య యాదవ్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి ప్రవీణ్ గోపాల్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఈశ్వరయ్య ఈ కార్యక్రమంలోప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.