గ్రామ ప్రణాళికలో భాగస్వాములు కావాలి
మెదక్,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీసభ్యులు తమ వంతు కృషి చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 5 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి గ్రామసభల్లో తెలపాలన్నారు. మహిళలు ముందుకు వచ్చి గ్రామంలో నెలకొన్న సమస్యలను కమిటీల దృష్టికి తీసుకురావాలన్నారు. కమిటీల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఅన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పక వినియోగించుకోవాలని సూచించారు. బహిరంగంగా మల విసర్జన చేస్తే వారికి జరిమానా విధించాలని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు
తప్పకుండా గ్రామాల్లోనే ఉండాలన్నారు. ఇండ్ల వద్ద నీటి నిల్వలు, చెత్తా చెదారం నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. 30 రోజుల్లో గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎల్‌పీవో వరలక్ష్మి పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం 30రోజుల్లో తీసుకునే కార్యాచరణపై గ్రామస్తులకు సంబంధిత ప్రత్యేక అధికారులు అవగాహన కల్పించి, కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో వరలక్ష్మి మాట్లాడుతూ ప్లలెలో ప్రగతిని సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి తమ వంతు సహకారంగా ప్రతిఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో కమిటీలను వేసుకోవాలని సూచించారు.