గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి….
టీ టీ యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు…
మల్లాపూర్ (జనంసాక్షి) ఆఘష్టు:5 రోజున గ్రామ రెవెన్యూ సహాయకులు న్యాయపరమైన డిమాండ్ ను పరిష్కరించేసులని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ టీ యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు కు వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ సహాయకుల వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వి ఆర్ ఏ లకు పే స్కేల్ అమలు చేయాలని,అర్హత కలిగిన వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వాలని,55 సంవత్సరలు నిండిన వారి వరసులకు వారి స్థానంలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ,చాలి చాలని వేతనాలతో దుర్భరమైన జీవితం
గడుపుతున్నామని వారు తేదీ 25.7.2022 రోజునుండి నిరవధికంగా సమ్మె చేస్తున్నారని వారి సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచించి పతిస్కరించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ టీ యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించారు.ఇట్టి కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ గోరుమంతుల సుధాకర్,మల్లాపూర్ ప్రెసిడెంట్ షేక్ రఫీ,ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు బొర్గం గంగాధర్, బి రవీందర్,సతీష్,గజేందర్,శ్రీనివాస్,నరేష్,రాజు,పాషా,ప్రవీణ్,నరేష్, బి నరేష్,తదితరులు పాల్గొన్నారు.