గ్రామ సమగ్ర అభివృద్ధి ధ్యేయం

— గ్రామ సర్పంచ్ గుగులోతు రమాదేవి.

కామేపల్లి,జూన్ 10 (జనం సాక్షి):-
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
రుక్కీతండా గ్రామపంచాయతీలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు.గ్రామ అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలుపై చర్చలు జరిపి ప్రజలను అవగాహన కల్పించారు
గ్రామసభలో గ్రామ అభివృద్ధి పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక,పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై చర్చించారు. గ్రామ ప్రజలు పాలకమండలి సభ్యులు సూచనలు, చేస్తూ తమ సమస్యలను సర్పంచ్ రమాదేవి గ్రామ సమస్యలు అన్ని అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ గుగులోత్ రమాదేవి హామీ ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని,ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సర్పంచ్ పేర్కొన్నారు
పిల్లలందరికి ప్రభుత్వ బడిలో చేర్పించాలని. ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జిపిఓ కందయ్య. విద్యుత్ శాఖ లైన్మెన్ మధు ఏ ఈ ఓ
భాస్కర్. ప్రధానోపాధ్యాయులుశ్రీనివాసరావు.లలిత రాములు వార్డు మెంబర్లు బానోతు బుజ్జి.కురసం రామ్మూర్తి.గుగులోతు మంగ్యా.పంచాయతీ కార్యదర్శి ఎం డి ఫజల్.ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.