అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

మిడ్జిల్. ఆగస్టు 6.( జనం సాక్షి)
ఆగస్టు 1 నుండి 7 వరకు జరిగే ఈ వారోత్సవాలలో భాగంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు గురువారం
అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ అంగన్‌వాడీ సూపర్వైజర్ పర్యవేక్షణ లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీడీఎస్. వైద్య సిబ్బంది విచ్చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.తల్లిపాలు నవజాత శిశువులకు ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటివని పేర్కొన్నారు. పుట్టిన గంట లోపే బిడ్డకు అందించే ముర్రుపాలు (Colostrum) శిశువుకు తొలి టీకాగా పనిచేసి. భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నర్మదా గ్రామ ప్రజలు గర్భిణీలు బాలింతలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు



