మారం జగదీష్ జన్మదిన వేడుకలు

ఖమ్మం, ఆగస్టు 6, (జనంసాక్షి): తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్, తెలంగాణ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ జన్మదిన వేడుకలను తెలంగాణ ఎన్జీవోల సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, తెలంగాణ ఉద్యోగుల ఐక్యత కోసం మారం జగదీష్ అందిస్తున్న నాయకత్వం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో సంవత్సరాలు ఉద్యోగులకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ఆర్గనైజేషన్ కార్యదర్శి జెడ్.ఎస్. జైపాల్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, ఉద్యోగులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, తాళ్లూరి శ్రీకాంత్, భూస చంద్రశేఖర్, శ్రీధర్ సింగ్, రాధాకృష్ణ, కోటపాటి రుక్మారావు, వీరన్న, కృష్ణ, సుధాకర్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రాజుతో పాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.



