గ్రావిూణ ప్రాంతాల అభివృద్దికి కృషి

యాద్రాద్రి భువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేస్తోందన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తూ సమాచార, రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ సాధన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు.కేపాల్‌-కొండమడుగు రహదారికి రూ.4.80 లక్షల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కొండమడుగు నుంచి జైనపల్లి వరకు రోడ్డును పొడిగించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి సబ్‌కాల్వ ద్వారా వడపర్తి కత్వాలోకి నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.