గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై మండల విద్యాశాఖ అధికారులు, చీప్ సూపరింటెండెంట్, లైజనింగ్ ఆఫీసర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్షించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ…..
ఈనెల 16న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు గాను 20 పరీక్ష కేంద్రాలలో 5,134 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ వివరించారు.నాగర్ కర్నూల్ పట్టణంలో 9 పరీక్ష కేంద్రాలు, కల్వకుర్తిలో ఐదు పరీక్ష కేంద్రాలు, అచ్చంపేట లో మూడు పరీక్ష కేంద్రాలు కొల్లాపూర్ లో మూడు పరీక్ష కేంద్రాలు మొత్తం 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, విద్య, మున్సిపల్, వైద్యశాఖల అధికారులు ఆయా కేంద్రాల వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలని ఆదేశించారు.అన్ని పరీక్ష కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటు కేంద్రాల్లో అవసరమైన ఫర్నీచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకంగా బస్సులను నడపాలని పేర్కొన్నారు.
 పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు అదేవిధంగా ప్రైవేటు సెంటర్లలో ఆయా యాజమాన్యాలు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రాబోయే రోజుల్లో విద్యార్థుల భద్రత మరియు సౌలభ్యానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పాటునంది స్తాయన్నారు.రాబోయే రోజుల్లో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మరిన్ని నోటిఫికేషన్లు రావడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీని దృష్ట్యా ఇప్పటి నుంచే అన్ని రకాలుగా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని వివరించారు.10 గంటలకు జరిగే పరీక్షకు పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు 8:30 కి చేరుకోవాలన్నారు.
ఈసారి ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఏర్పాట్లు జరగనున్నట్లు వెల్లడించారు.పరీక్షలు కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కు తావు లేకుండా జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.పరీక్ష విధులు నిర్వహించే నిర్వహించే సిబ్బంది అన్ని జాగ్రత్తలతో విధులకు హాజరు కావాలన్నారు.పరీక్షలు రాసే అభ్యర్థులు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉన్నందున వలన 8:30 కే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.పరీక్షా సమయాన్ని కంటే 15 నిమిషాలు ముందుగానే గేట్లు మూసివేయబడుతుందని అభ్యర్థులు గమనించాల్సిందని సూచించారు.
పరీక్షలు రాసే అభ్యర్థుల హాల్ టికెట్ లపై ఫోటో ప్రింట్ కాకపోతే అట్టి హాల్ టికెట్ పై ఫోటో అతికించి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవలసి ఉంటుందని వెల్లడించారు.అంతకుముందు అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ….
పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి మహిళల అభ్యర్థులు కేవలం మంగళ సూత్రాలు మినహా ఎలాంటి ఆభరణాలు ధరించి పరీక్షా కేంద్రాల్లోకి రాకూడదని తెలిపారు.అభ్యర్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు బంగారు ఆభరణాల తోపాటు బూట్లు సాక్స్ ధరించి పరీక్ష కేంద్రాలకు రాకూడదన్నారు.అదేవిధంగా బ్లూ మరియు బ్లాక్ బాల్ పెన్లు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.
ఓఎంఆర్ పై ఎలాంటి కొట్టివేతలు దిద్దడాలు వైట్నర్లు ఉండరాదు అన్నారు.పరీక్షల ప్రశ్నాపత్రాలు నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయం నుండి ఉదయం 6 గంటలకు బందోబస్తు మధ్య ఆయా పరీక్ష కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మను చౌదరి మోతిలాల్, అదనపు ఎస్పీ భరత్, డీఎస్పీ మోహన్ కుమార్,డిఈఓ గోవింద రాజు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, ఎస్ బి సి ఐ శ్రీనివాసులు, ప్రభుత్వ పరీక్షలు నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు,ఆర్డీవోలు నాగలక్ష్మి, హనుమాన్ నాయక్, పాండు నాయక్, మున్సిపల్ కమిషనర్లు, తాహసిల్దార్లు,మండల విద్యాధికారులు ఆయా పరీక్ష కేంద్రాల ప్రిన్సిపల్ లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.