గ్రూప్ వన్ పరీక్షలకు 80 శాతం అభ్యర్థుల హాజరు
ఇంచార్జ్ కలెక్టర్ దీపక్ తివారి
యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షలో 80.15 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.ఆదివారం నాడు ఆయన భువనగిరి పట్టణంలోని మదర్ థెరిస్సా హై స్కూల్, జాగృతి డిగ్రీ కాలేజ్, నవభారత్ డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సందర్శించి అభ్యర్థుల హాజరు, బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు.జిల్లాలో ఏర్పాటు చేసిన 13 పరీక్షా కేంద్రాలలో మొత్తం 3644 మంది అభ్యర్థులకు గాను 2921 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 723 మంది ఆబ్సెంట్ అయ్యారని, 80.15 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు.