గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి.అఖిల భారత యువజన సమాఖ్య ( ఏవైఎఫ్)డిమాండ్.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ఈ నెల 16వ తేదీన గ్రూప్ 1 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10:30  నుండి  మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించారు.ఐతే హైదరాబాద్ లాల్ పేట శాంతినగర్ లోని ఎస్ఎఫ్ఎస్ ( సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ ) హై స్కూల్  పరీక్ష   కేంద్రంలో  మాత్రం మధ్యాహ్నం1:00నుండి 3:30 నిమిషాల వరకు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారని, ఈ పరీక్షకు  90 మంది అభ్యర్థులు హాజరైయ్యారని, ఉదయం  నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం  నిర్వహించడం నిబంధనలకు  విరుద్ధమని, దీనిపై అనేక  ఆరోపణలు వస్తున్నాయని,తక్షణమే  రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తప్పు చేసిన అధికారులు మరియు పాఠశాల యాజమాన్యం పై చట్టపరమైన  చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (aiyf) సూర్యపేట జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (aiyf) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను  మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో  ఏర్పరుచుకున్న స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తుందని,ఇలాంటి సంఘటన  జరగడం సిగ్గుచేటని వారి ధ్వజమెత్తారు.లాల్ పేట ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలలో నిబంధనలకు వ్యతిరేకంగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని,అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా  ఇటువంటి రహస్య పరీక్ష కేంద్రాల్లో  కూడా గ్రూప్ 1పరీక్ష  కేంద్రాలు  ఉండొచ్చని,కాబట్టి ఇట్టి ఆరోపణల పై విచారణ ద్వారా నిగ్గు తేల్చాలని ఇలాంటి తప్పిదాలపై  ప్రభుత్వం మరియు సంబంధిత  అధికారులు స్పందించి అక్కడి యాజమాన్యం మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.లక్షలాదిమంది  అభ్యర్థుల భవిష్యత్తుపై ఆధారపడిన ఈ పరీక్షను  సమర్థవంతంగా నిర్వహించాల్సిన TSPSC నిర్లక్ష్యంగా నిర్వహించడం బాధాకరమని,ఇప్పటికైనా స్పందించకుంటే  రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.