గ్రూప్ 1 పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి.

నిర్మల్ బ్యూరో, అక్టోబర్15,జనంసాక్షి,,,  ఆదివారం  జరగబోయే  గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష  సందర్బంగా
జిల్లా  పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, SP ప్రవీణ్ కుమార్,  అదనపు కలెక్టర్ రాంబాబు లు పలు   పరీక్ష కేంద్రాలను  సందర్శించి   ఏర్పాట్లను  పరిశీలించారు.
ఎలాంటి లోటపాట్లకు  తావివ్వకుండా  పకడ్బందీ ఏర్పాట్లు చేయడం  జరిగిందని  తెలిపారు.
జిల్లాలో 19  కేంద్రాలలో 4492 మంది పరీక్షకు హాజరవుతారని,  పరీక్షకు నియమించబడ్డ పరీక్షా కేంద్ర ముఖ్య పర్యవేక్షణ అధికారులు 19 మంది,  లైజన్ అధికారులు 19 మంది, సహాయ లైజన్ అధికారులు 19 మంది, 207 మంది  ఇన్విజి లేటర్లను  నియమించడం జరిగిందని
అధికారులు  ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా,   నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.  విద్యార్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ తర్వాతనే పరీక్ష హాల్లోకి అనుమతించాలని,   పరీక్షకు సంబంధించి పకడ్బందీగా పూర్తి ఏర్పాట్లు చేశామని,  సమన్వయo తో పరీక్షను నిర్వహించి  విజయవంతం చేయాలనీ తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని, సరైన సమయానికి చేరుకొని పరీక్షను, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా, ప్రశాంతంగా  పరీక్షా వ్రాసేలా చూడాలని  చీఫ్ సూపరేండెంట్ లకు పలు సూచనలు, సలహాలు చేశారు.
 బయో మెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 8-30  గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని,  10-15 ల తర్వాత పరీక్షా కేంద్రంలో ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని తెలిపారు.  హాల్ టికెట్ తో పాటు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్, ప్రభుత్వ గుర్తింపు కార్డ్ లలో (పాన్ కార్డు ,ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ,డ్రైవింగ్  లైసెన్స్ పాస్ పోర్ట్) ఏదైనా ఒకటి తీసుకొని రావాలని సూచించారు. హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా ప్రింట్ కాని అభ్యర్థులు గెజిటెడ్ అధికారితో సంతకం చేసిన 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని తెలిపారు.
పరీక్ష కేంద్రంలో రైటింగ్ ప్యాడ్ లు, మొబైల్ ఫోన్, క్యాలుకులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని,  పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని , షూ ధరించి రావద్దనీ సూచించారు. OMR జవాబు పత్రంపై వైటనర్/చాక్ పవర్/బ్లేడ్/ఎరేజర్ ఉపయోగించడం నిషేధమని, పరీక్ష పూర్తయ్య వరకు అభ్యర్థులెవరు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరని సూచించారు.
పరిక్షా కేంద్రాలలో అభ్యర్థులకు బెంచీలు, టేబుల్స్, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్, త్రాగు నీటి సదుపాయం, స్త్రీ పురుషులకు విడివిడిగా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని
బయోమెట్రిక్ తరువాతనే అభ్యర్థులకు లోపలికి వదులాలని సూచించారు.
 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -1 పరీక్షలను ఎలాంటి తప్పులు దొర్లకుండా విజయవంతంగా నిర్వహించేందుకు  కృషి  చేయాలని తెలిపారు.
ఈ పర్యటన లో  రెవిన్యూ  డివిజనల్  అధికారి  తుకారామ్,  జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి,  పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, పోలీస్ శాఖ అధికారులు,  ప్రిన్సిపల్స్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Attachments area