గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం
` నగరంలో ‘ఐటీ రంగంలో వెల్లువలా అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు లోటు లేదని, గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ నగరాన్ని తీర్చుదిద్దుతామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హెచ్‌ఐసీసీలో 32వ హైసియా (హైదరాబాద్ స్టాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన కంపెనీలకు బెస్ట్ స్కిల్స్ అందిస్తున్నామని చెప్పారు. ఐటీలో మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తామని వెల్లడిరచారు.ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలెటిక్స్, సైబర్ సెక్యూరిటీ ప్రపంచాన్ని ఏలబోతున్నాయని, వీటిని ఇప్పటికే అందిపుచ్చుకుంటున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో సాంకేతికత వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ పారిశ్రామిక, ఐటీ హబ్‌గా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సాంకేతికత చేరాలని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సైన్యం, అంతరిక్షంలో సాంకేతికత వినియోగం పెరగడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్థిక, ఐటీ, ఏఐ రంగాల్లో రాణిస్తున్నామన్న శ్రీధర్ బాబు, దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ వాటా మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌లో ఊపందుకుంటున్నాయన్నారు