గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది
మళ్లీ టిఆర్‌ఎస్‌తోనే అది సాధ్యం: టిఆర్‌ఎస్
రామగుండం,నవంబర్3(జనంసాక్షి): రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలోనే అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని రామగుండం డివిజన్ ప్రచారంలో డివిజన్ నేత మెరుగు నరేశ్ తదితరులు అన్నారు. ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యానారాయణను మరోమారు గెలిపించి అభివృద్దికి పట్టం కట్టాలని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదిముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలతో ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తున్నారన్నారు. పేద బిడ్డలు చదువుకోడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఇంగ్లిష్ విూడియం చదువులు చెబుతున్నారన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. కడుపులో బిడ్డ నుంచి కాటికి కాళ్లు చాచిన వ్యక్తి వరకు అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. వివిధ గ్రామాల్లో నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్‌లో తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హాయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకవచ్చిన ఘనత సోమారపునకే దక్కుతుందన్నారు. గత 70ఏళ్లుగా వెనుకబాటుకు గురైతే సీఎం కేసీఆర్ నాలుగున్నర సంవత్సరాల్లోనే సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 అందజేయడం జరుగుతుందన్నారు. ఒకే దఫాలో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తారన్నారు. పంట పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు అందజేస్తామన్నారు. ఇండ్లులేని నిరుపేదలకు తన సొంత స్థలంలోనే డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు జీవన భృతి దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తారని సూచించారు. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించి గెలిపించాలన్నారు. గెలిపించిన తర్వాత సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు.