ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుక
హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): మండలంలోని బూరుగడ్డ (మాచవరం) గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ నందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకను గ్రామ సర్పంచ్ షేక్ సలీమా రంజాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆదెమ్మ, పంచాయతీ సెక్రెటరీ కొండా ఉపేందర్, షేక్ అలీ, నాగలక్ష్మి, చింత నాగేంద్ర, గూడెపు నాగలింగం, గడ్డం నరసింహ, గువ్వల అయోధ్య, యరగని వెంకన్న, ఎస్కే సైదా, చిక్కుళ్ళ వీరబాబు పాల్గొన్నారు.
Attachments area