ఘనంగా ఎఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
జూలూరుపాడు, ఆగష్టు 12, జనంసాక్షి: ఎఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంఘం నాయకులు జూలూరుపాడులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చాంద్ పాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను భారంగా మార్చిందని అన్నారు.1936 ఆగస్టు12న ఆవిర్భవించిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ అని, స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది విద్యార్థులను ఐక్యం చేసి పోరాటంలో ఎఐఎస్ఎఫ్ ప్రధాన భూమిక వహించిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై 87వ ఆవిర్భావ స్ఫూర్తితో సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు చండ్ర నరేంద్ర కుమార్, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుల్ మీరా, సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, అఖిల్, మహేష్, సందీప్, పవన్, రమేష్, మణికంఠ, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.