ఘనంగా ఐలమ్మ జయంతి
అల్లాదుర్గం, సెప్టెంబర్ 26
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతిని సోమవారం అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు
ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగ పలువురు మాట్లాడుతూ ఐలమ్మ జీవితం అందరికి స్ఫూర్తి దాయకమన్నారు
కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షుడు నర్సింలు, బలరాం,నక్క సూర్యకుమార్, జగన్, రవి,
ఆంజనేయులు, మల్లయ్య ,సంగమేశ్వర్ ,బేతయ్య తదితరులు పాల్గొన్నారు