*ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు*

కమ్మర్పల్లి 24.జులై(జనంసాక్షి)ఆదివారం రోజు కమ్మర్‌పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలతో కలిసి జరుపుకోవడం జరిగింది‌.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేంధర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.కేటీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మండల పార్టీ ఆధ్యర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
      అనంతరం పాఠశాల విద్యార్థినులకు కేకు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు ,ఎంపీటీసి లు, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area