ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ;
మండలంలోని మల్లారం కొయ్యూరు లలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఆమె చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులర్పించారు స్వీట్లు పంచారు .అనంతరం రజక సంఘం మండల అధ్యక్షుడు పావురాల ఓదెలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కొయ్యూరు లో అందరి సహకారంతో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానించారు ఆమె ఆశయాలను కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోనె శ్రీనివాసరావు చెప్యాల రామారావు రజక సంఘం మండల ఉపాధ్యక్షుడు కనుకుల శ్రీకాంత్ రాకేష్ గౌరవ అధ్యక్షులు పైడ్ ఆకుల పోచ మల్లయ్య బిసి సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ అనిపెద్ది రాంబాబు నాయిబ్రాహ్మణ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ గిరి సమ్మయ్య యాదవ మహాసభ మండల అధ్యక్షుడు యాదన్న రామన్న యాదవ్ పావిరాల లక్ష్మణ్ రజక సంఘం నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు