ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

హుజూర్ నగర్ సెప్టెంబర్ 26(జనం సాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ ఆశయాలు సాధించాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాసు , హుజూర్ నగర్ ఆర్డిఓ వెంకారెడ్డి, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి లు కోరారు. సోమవారం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో పుట్టి నా ఐలమ్మ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కు ఐలమ్మ పేరు నామకరణం చేయాలని కోరారు. ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంకుబండు పై ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 14 వార్డ్ కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్, నాగారపు పాండు, దాసరాజు నారాయణరావు, పెడ్డారపు భవాని శంకర్, దుగ్గి గురువర్మ, చిక్కుళ్ళ గోవిందు, ఎం వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, గువ్వల వీరయ్య , గూడెపు దీప, వీరభద్రరావు, కొమ్ము శ్రీనివాస్, జక్కుల రమేష్, బిక్షం , యాకోబు తదితరులు పాల్గొన్నారు.