ఘనంగా చాకలి ఐలమ్మ 127వ జయంతి

*తెలంగాణ పోరాటాలకు స్పూర్తి ప్రధాత వీరనారి చాకలి

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
చాకలి ఐల‌మ్మ తీవ్ర వివ‌క్ష‌ను ఎదిరించి తెలంగాణ ప్రజల ఆత్మ‌గౌర‌వం కోసం నిజాంకు వ్య‌తిరేకంగా బందూకును చేత‌ప‌ట్టి సాయుద పోరాటం చేసింద‌ని రిటైర్డ్ ఎస్సై ముషీరాబాద్ లింగమన్న అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెట్టిచాకిరి, వివ‌క్ష‌త‌ల‌ను తెలంగాణ నుండి పార‌ద్రోలేందుకు చిట్యాల ఐల‌మ్మ పోరాటం దోహదం చేసింద‌న్నారు.

చిట్యాల ఐల‌మ్మ తెలంగాణ త‌ల్లి అని, అదే స్పూర్తిని నేటితరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
యావత్ వెనుకబడిన వర్గాలంతా సంఘటితంగా ఉండాలని, తమ హక్కుల సాధన కోసం నిరంతరం ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు సాగించాలన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సైతో పాటు
ఊకంటి రవీందర్ రెడ్డి, జంపాల నరసయ్య, డాక్టర్ అంబటి రాజు తదితరులు పాల్గొన్నారు.