ఘనంగా చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు

డోర్నకల్ సెప్టెంబర్ -10 (జనం సాక్షి న్యూస్)

డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామం ఎక్స్ రోడ్ వద్ద జై దుర్గా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుక సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనిదని,నిజం రజాకారుల గుండెల్లో నిప్పురవ్వగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ బాంచంద్ అన్న చేతుల్లో నిజాం రాజాకారులను గడగడ లాడించిన ఆమెకు తెలంగాణ రైతంగ సాయుధ పోరాట చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. భూమికోసం,భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో నిజం రాజకారులను రాపాక రామచంద్రారెడ్డి ఆవడాలను ఏదిరించి ఆ పాత్ర ప్రజలో చైతన్య రగిలించింది. ప్రజలు మాస, ప్రాణాలకు రక్షణ లేని నాటి రోజుల్లో మహిళగా గోడలి పట్టి విసునూరు దేశముఖ్ లను గడగడ లాడించిందని వాళ్ళు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేరెడ్డి సమ్మిరెడ్డి,ఉప సర్పంచ్ గొడుగు సురేష్,కెవిపిఎస్ మండల అధ్యక్షులు పెంకటి వెంకట్ రాములు,జై దుర్గా రజక సంఘం నాయకులు డోర్నకల్ మండలం ప్రధాన కార్యదర్శి కొడవండ్ల ప్రవీణ్ కుమార్,రజక సంఘం పెద్దలు కొడవండ్ల వెంకన్న, కొడవండ్ల యాదగిరి, గ్రామ అధ్యక్షుడు కొడవండ్ల సైదులు, కార్యదర్శి కొడవండ్ల వెంకన్న,కమిటీ సభ్యులు చిక్కుల వెంకన్న, నాగయ్య,నరసింహ, వేణు,వీరన్న,సురేష్ బాబు,సైదులు,శ్రీను, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగభూషణం,జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్లు, గూడూరు వెంకన్న,బద్దు నాయక్, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్,ఆటో యూనియన్ల సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.