ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) జనసంఘ్   వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా గురువారం  ఎల్.బి నగర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి  హాజరై    చెట్లు నాటడం జరిగింది .  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  శామప్రసాద్ ముఖర్జీ  ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది దేశ తొలి ప్రధాని నెహ్రూ  సొంత రాష్ట్రమైన ఇటువంటి జమ్ము కాశ్మీర్ కి ఏదైనా చేయాలని ఆలోచనతో ఆర్టికల్ 370 అనే భయంకరమైన జిఓ తీసుకురావడం జరిగింది జీవో లో ఉన్న అంశాలు అన్ని రాష్ట్రాలకు ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయినీ  జమ్ము కాశ్మీర్ కి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి భారతదేశం మొత్తం సుప్రీంకోర్టు తీర్పు అమలైతే జమ్ము కాశ్మీర్ లో మాత్రం  కోర్టు తీర్పు చెల్లదని జమ్ము కాశ్మీర్ కి ప్రత్యేక జెండా ప్రత్యేక ఎజెండా కావాలని ఆనాడు నెహ్రూ మూర్ఖత్వంతో    కోరడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఇటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ   ఏక్ దేశ్ మే దో విధాన ధో నీషాన్ ధో ప్రధాన్ నహి  చే లింగే పిలుపునివ్వడం జరిగిందిదనిఅన్నారు  .   మన ప్రియతమ ప్రధాని  నరేంద్రమోదీ  జమ్మూ కశ్మీర్లో   ఆర్టికల్ 370 ని రద్దు చేసి ముకర్జీ కి నిజమైన నివాళి అర్పించారని తెలిపారు . ఈ కార్యక్రమంలో  డివిజన్ అధ్యక్షుడు విజయభాస్కర్ ఏస్ సీ మోర్చా  అసెంబ్లీ కన్వీనర్ గుండె కిరణ్ కుమార్ ,   మారోజు రమేశ్ చారి  జగదీష్ కృష్ణంరాజు హరిప్రసాద్  రాజేవీలక్షన్. గట్టు రవి రాజేష్ భారత్ సాయి పాల్గొన్నారు

తాజావార్తలు